నాన్నకు ప్రేమతో బాల్ గేమ్ Detailed Explanation | Nannaku premato


   యుంగ్ టైగర్ NTR, లెక్కల మాస్టారు సుకుమార్ & రాక్ స్టార్ DSP వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన "నాన్నకు ప్రేమతో" సినిమా నుండి బాల్ గేమ్ గురించి ఒక చిన్న విశ్లేషణ.


   నాన్నకు ప్రేమతో ఈ సినిమా లో "బాల్ గేమ్" అందరికి గుర్తుండే ఉంటుంది. అభిరామ్(NTR) ఎంతో క్లియర్ వివరించిన ఒకసారి చూస్తే అర్ధమవ్వదు. Actual గా ఆ బాల్ గేమ్ నేచురల్ గా ఉండాలని నిజమైన గోల్డ్ & సిల్వర్ బాల్స్ ని ఉపయోగించారంట.




   మూవీ లో మొదటి సారి కృష్ణమూర్తి (జగపతిబాబు), అభిరామ్(NTR) ని ఈ గేమ్ ఆడమన్నపుడు, అభిరామ్ కృష్ణమూర్తి యొక్క ఫోన్ తీసుకుంటాడు. అభిరామ్ తన Explanation మొత్తం కృష్ణమూర్తి మొబైల్ లో రికార్డ్ చేసి అర్ధం కాకపోతే వీడియో మళ్ళీ చూడమని చెప్పి వెళ్లిపోతాడు. కానీ నిజానికి అభిరామ్ మొబైల్ ని వీడియో రికార్డ్ చెయ్యడం కోసం మాత్రమే కాదు, ఏ బాల్ లో గోల్డ్ ఉందొ తెలుసు కోవడానికి కూడా ఉపయోగించాడు.



  అది ఎలా అంటారా...... Actual గా బాల్స్ లోపల మాగ్నెట్స్ ఉంటాయి, అలాగే మొబైల్ లోపల కూడా స్పీకర్ మాగ్నెట్స్ ఉంటాయి. మొబైల్ ని బాల్స్ మీదగా తీసుకువెళ్లినపుడు అవి కొద్దిగా కాదులుతాయి. వీటిలో గోల్డ్ బాల్ ఎలా కనిపెట్టడంటే, అభిరామ్ కి ఫ్జిక్స్ సబ్జెక్ట్ లో పిరియాడిక్ టేబుల్ లో అన్ని మెటల్స్ యొక్క వెయిట్ డెన్సీటీ తెలిసే ఉంటుంది. అవిధం గా ఒక్కో మెటల్ కి ఒక్కో డెన్సీటీ ఉంటుంది. ఉదాహరణకు "గోల్డ్ డెన్సీటీ 19.32, సిల్వర్ డెన్సీటీ 10.49" వీటిలో సిల్వర్ బాల్ బరువు తక్కువ మొబైల్ బాల్స్ మీదగా తీసుకు వెళ్ళినపుడు సిల్వర్ బాల్ ఎక్కువగా గా కదులుతుంది. ఈ విధంగా గోల్డ్ బాల్ ని కరెక్ట్ గా కనిపెట్టాడు.




   ఇదే బాల్స్ గేమ్ 2వ సారి అభిరామ్ కృష్ణమూర్తిని ఆడమన్నపుడు, అభిరామ్ బాల్స్ ని టేబుల్లో మీద కొంత ఫోర్స్ తో పెడతాడు ఆ ఫోర్స్ కి సిల్వర్ బాల్ బరువు తక్కువ కాబట్టి కొద్దిగా ఎక్కువగా మూవ్ అవుతుంది కృష్ణమూర్తి ఆ బాల్ ని తీయమంటాడు తను ఓడిపోయాడు....  

 

   ఏది ఏమైనా మన లెక్కల మాస్టారు(సుకుమార్) గారి విజన్, ఆయనకు మూవీ మేకింగ్ తో ప్రేక్షకులకి మంచి ఎంటర్టైనమేట్ నే ఇస్తారు.


* ఆర్టికల్ చదివినందుకు Thank you,

ఏమైనా తప్పుగా చెప్పిఉంటే మీ కామేట్స్ ద్వారా తెలపండి నేను సరిచేస్తాను.
https://decodetelugumovies.blogspot.com/

No comments:

Post a Comment