రోలెక్ క్యారెక్టర్ Detailed Explanation | Vikram



 
Ulaga Nayagan కమల్ హాసన్, Makkal Selvan విజయ్  సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య వీళ్ళ కాంబినేషన్ లో లోకేష్ కానకరాజు దర్శకత్వం వహించిన చిత్రం 'విక్రమ్ హిట్లిస్ట్'. ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం దాదాపు 10 ఏళ్ళ తరువాత కమల్ హాసన్ గారికి హిట్ ఇచ్చిన చిత్రం. మొత్తం సినిమా ఒక ఎత్తు అయితే చివరి 10 మిమిషాలు మాత్రం ఒక ఎత్తు. ప్రతి ఒక్క మూవీ లవర్ కి ఒక మంచి హై ఇచ్చిన సన్నివేశం అది.
 



 
విక్రమ్ మూవీ రిలీజ్ కు ముందే అందరికీ తెలుసు సినిమాలో సూర్య అతిధి పాత్ర పోషించారు అని. అయినా సరే ఆ సీన్ చూసినప్పుడు గూస్బంప్స్ వస్తాయి. అంతేకాకుండా థియేటర్లో విజిల్స్ వేసి గోల చేసిన సీన్ అది. ఆ సీన్ అందరికీ అంతగా నచ్చడానికి కారణం సూర్య గారి యాక్టింగ్ & అనిరుద్ BGM, అంతేకాకుండా లోకేష్ కనకరాజు ఈ క్యారెక్టర్ని చాలా Unique and Passionate గా డిజైన్ చేయడం.



లోకేష్ కనకరాజు ఈ ఒక్క సీన్ లో Rolex యొక్క వస్తువులు అతని మాటలు మరియు చేతల ద్వారా క్యారెక్టర్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. రోలెక్స్ క్యారెక్టర్ డిజైన్ చేయడంలో లోకేష్ కనకరాజు సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. కారులో నుండి దిగిన రోలెక్స్ తన చేతిలో ఒక 'మార్షల్ స్పీకర్' 'చెఫ్ నైఫ్' తన 'ఇయర్ రింగ్స్' శరీరం పై ఉన్న 'స్కార్పియన్ టాటూ' తను డ్రగ్స్ తీసుకోవడం వంటి చిన్న చిన్న విజువల్స్ ద్వారా Rolex యొక్క పాత్ర ని Unique way లో ప్రజెంట్ చేశారు.



ఇక్కడ రోలెక్స్ చేతిలో 'మార్షల్ స్పీకర్' ను గమనిస్తే తను ఒక మ్యూజిక్ లవర్ అని అర్థమవుతుంది. ఇంకా తన శరీరంపై ఉన్న గాయాలు తను ఒక డ్రగ్ loard ల మారడానికి ఎంత కష్టపడ్డాడు అనే విషయం తెలుస్తుంది. అంతే కాకుండా అతన్ని అందరూ రోలెక్స్ అని పేరు పెట్టి పిలుస్తున్నారు అని తన కింద పనిచేసే ఒక వ్యక్తి తలను నరికి అందరూ ఇకనుండి తన సార్ అని పిలవాలి అని చెప్పడం చూస్తే Leadership ను కోరుకుంటాడు అని తెలుస్తుంది. ఇంకా తన కింద పనిచేసే వ్యక్తిని చంపాను అని గాని కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ లేని ఒక Likable Sociopath కనిపిస్తాడు.



సోసియో పాత్ గురించి సింపుల్ గా చెప్పాలంటే తప్పు ఒప్పులు పట్టించుకోకుండా తనకు కావలసింది దక్కించుకోవడం కోసం సైకోలా బిహేవ్ చేస్తాడు అని అర్థం. నిజ జీవితంలో ఇటువంటి వ్యక్తులను ఎదురైతే మనం కచ్చితంగా భయపడతాం, సూర్య గారు చెప్పే డైలాగ్స్ ఇంకా మేనరిజం వల్ల అందరికీ నచ్చిన ఒక మంచి పాత్ర గా ఉంది.


రోలెక్స్ క్యారెక్టర్ అంతబాగా నచ్చడానికి అర్థం అవ్వడానికి డైలాగ్స్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి Rolex బ్యాక్ స్టోరీని తన డైలాగ్ ద్వారా చిన్న చిన్న Hins ఇచ్చారు.

👉 27 ఏళ్లు అయింది ఈ సామ్రాజ్యాన్ని స్థాపించి.

👉 తాతల నుండి బాబు నుండి వచ్చింది కాదు ఒక్కడినే సామ్రాజ్యాన్ని స్థాపించాను.

ఈ రెండు డైలాగ్స్ ని గమనిస్తూనే రోలెక్స్ యొక్క బ్యాక్ స్టోరీ ఎంత High Scale లో ఉండబోతుందని ఆడియన్స్కి క్యారెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. "సింహం వేటాడే టప్పుడు అడవి ఎంతో ప్రకాశంగా ఉంటుంది. అదప్పుడు ఆకలితో ఉన్నపుడు అడవి కూడా పస్తులు ఉండాలి" ఇక్కడ సింహం ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో సింహం లాంటి రోలెక్స్ తన సరుకు, డబ్బు, పవర్ కోల్పోయాడు కాబట్టి తనతో ఉన్న వాళ్ళని తనకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన వాళ్ళని ఎలా చంపుతాడు అన్నది నెక్స్ట్ మూవీ మీద అంచనాలను పెంచాయి.


ఇక రాబోయే చిత్రాల్లో Rolex పాత్ర ఏవిధంగా ఉండబోతుందో, ఇంకా ఖైదీ 2 లో కార్తి మరియు సూర్యా ల మధ్య సీన్స్ ఎలా ఉంటాయో లోకేష్ కనకరాజు ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు అన్నది వేచి చూడాలి.

* ఆర్టికల్ చదివినందుకు Thank you,

 మీ కామేట్స్ ద్వారా Feedback ను తెలపండి నేను సరిచేస్తాను.
https://decodetelugumovies.blogspot.com/

నాన్నకు ప్రేమతో బాల్ గేమ్ Detailed Explanation | Nannaku premato


   యుంగ్ టైగర్ NTR, లెక్కల మాస్టారు సుకుమార్ & రాక్ స్టార్ DSP వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన "నాన్నకు ప్రేమతో" సినిమా నుండి బాల్ గేమ్ గురించి ఒక చిన్న విశ్లేషణ.


   నాన్నకు ప్రేమతో ఈ సినిమా లో "బాల్ గేమ్" అందరికి గుర్తుండే ఉంటుంది. అభిరామ్(NTR) ఎంతో క్లియర్ వివరించిన ఒకసారి చూస్తే అర్ధమవ్వదు. Actual గా ఆ బాల్ గేమ్ నేచురల్ గా ఉండాలని నిజమైన గోల్డ్ & సిల్వర్ బాల్స్ ని ఉపయోగించారంట.




   మూవీ లో మొదటి సారి కృష్ణమూర్తి (జగపతిబాబు), అభిరామ్(NTR) ని ఈ గేమ్ ఆడమన్నపుడు, అభిరామ్ కృష్ణమూర్తి యొక్క ఫోన్ తీసుకుంటాడు. అభిరామ్ తన Explanation మొత్తం కృష్ణమూర్తి మొబైల్ లో రికార్డ్ చేసి అర్ధం కాకపోతే వీడియో మళ్ళీ చూడమని చెప్పి వెళ్లిపోతాడు. కానీ నిజానికి అభిరామ్ మొబైల్ ని వీడియో రికార్డ్ చెయ్యడం కోసం మాత్రమే కాదు, ఏ బాల్ లో గోల్డ్ ఉందొ తెలుసు కోవడానికి కూడా ఉపయోగించాడు.



  అది ఎలా అంటారా...... Actual గా బాల్స్ లోపల మాగ్నెట్స్ ఉంటాయి, అలాగే మొబైల్ లోపల కూడా స్పీకర్ మాగ్నెట్స్ ఉంటాయి. మొబైల్ ని బాల్స్ మీదగా తీసుకువెళ్లినపుడు అవి కొద్దిగా కాదులుతాయి. వీటిలో గోల్డ్ బాల్ ఎలా కనిపెట్టడంటే, అభిరామ్ కి ఫ్జిక్స్ సబ్జెక్ట్ లో పిరియాడిక్ టేబుల్ లో అన్ని మెటల్స్ యొక్క వెయిట్ డెన్సీటీ తెలిసే ఉంటుంది. అవిధం గా ఒక్కో మెటల్ కి ఒక్కో డెన్సీటీ ఉంటుంది. ఉదాహరణకు "గోల్డ్ డెన్సీటీ 19.32, సిల్వర్ డెన్సీటీ 10.49" వీటిలో సిల్వర్ బాల్ బరువు తక్కువ మొబైల్ బాల్స్ మీదగా తీసుకు వెళ్ళినపుడు సిల్వర్ బాల్ ఎక్కువగా గా కదులుతుంది. ఈ విధంగా గోల్డ్ బాల్ ని కరెక్ట్ గా కనిపెట్టాడు.




   ఇదే బాల్స్ గేమ్ 2వ సారి అభిరామ్ కృష్ణమూర్తిని ఆడమన్నపుడు, అభిరామ్ బాల్స్ ని టేబుల్లో మీద కొంత ఫోర్స్ తో పెడతాడు ఆ ఫోర్స్ కి సిల్వర్ బాల్ బరువు తక్కువ కాబట్టి కొద్దిగా ఎక్కువగా మూవ్ అవుతుంది కృష్ణమూర్తి ఆ బాల్ ని తీయమంటాడు తను ఓడిపోయాడు....  

 

   ఏది ఏమైనా మన లెక్కల మాస్టారు(సుకుమార్) గారి విజన్, ఆయనకు మూవీ మేకింగ్ తో ప్రేక్షకులకి మంచి ఎంటర్టైనమేట్ నే ఇస్తారు.


* ఆర్టికల్ చదివినందుకు Thank you,

ఏమైనా తప్పుగా చెప్పిఉంటే మీ కామేట్స్ ద్వారా తెలపండి నేను సరిచేస్తాను.
https://decodetelugumovies.blogspot.com/